మంచు మనోజ్ , మౌనిక ఆళ్లగడ్డ ఎంట్రీ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పెళ్ళి తర్వాత వారిద్దరూ ఇక్కడికి రావడం కొత్తేమీ కాకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చనీయాంశం అవుతోంది. భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా తల్లి దండ్రులకు నివాళులు అర్పించేందుకు వచ్చారు మౌనిక దంపతులు. అయితే అదొక్కటే రీజన్ కాదని, అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు.