2023 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడేసిన మెగాస్టార్ చిరంజీవి, మరో నెలరోజుల్లో హిస్టరీ రిపీట్ చేయడానికి థియేటర్స్ లోకి భోళా శంకర్ గా వస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో నటిస్తోంది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న భోలా శంకర్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి మెగా అభిమానుల్లో చిన్న భయం ఉండేది.…