Bhojshala: మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల ఆలయం-కమల్ మౌలా మసీదు సముదాయంలో శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులు, ముస్లింలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది శుక్రవారం నాడు వచ్చే హిందువుల పండగ బసంత పంచమి సందర్భంగా హిందువులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.