2026 సంక్రాంతి శోభతో గోదావరి జిల్లాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లె వాతావరణంలో రంగు ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాటాల మధ్య భోగి వేడుకలు సంబరాన్ని తాకుతున్నాయి. పండుగ వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను గోదావరి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. విజయవాడలో భోగి పండుగ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక పల్లె వాతావరణాన్ని తలపించేలా…
బోగి పండగ నాడు మేష రాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రయోజనాలు పొందుతుంటారు. ఈరోజు వ్యాపార వ్యవహారాలు కలిసివస్తాయి. పండగ రోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం పరమ శివుడు. నేడు శివార్చన చేసి.. వికలాంగులకు మీ వంతు సహాయం అందించండి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ గారు నేటి రాశి ఫలాలు అందించారు.
Bhogi 2026: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు భోగి పండుగతోనే ప్రారంభమవుతాయి. ధనుర్మాసం ముగింపుకు గుర్తుగా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు వచ్చే ఈ పండుగకు ఆధ్యాత్మికంగా , శాస్త్రీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2026 సంవత్సరంలో భోగి పండుగ కొత్త ఆశలను, ఆనందాలను మోసుకొస్తోంది. భోగి అంటే కేవలం మంటలు వేయడం మాత్రమే కాదు.. మనలో ఉన్న పాత ఆలోచనలను, నెగటివిటీని (ప్రతికూలతను) వదిలించుకుని, కొత్త వెలుగులోకి అడుగుపెట్టే ఒక గొప్ప సందర్భం. ఈ…
Bhogi 2026: తెలుగు లోగిళ్లు సంక్రాంతి సంబరాలుకు సిద్ధం అవుతున్నాయి.. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో.. రేపు అనగా బుధవారం రోజు భోగి పండుగ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్న ఆయన.. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త…
Bhogi 2026: తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. ముచ్చటగా మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో మొదటి రోజైన ‘భోగి’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2026 సంవత్సరంలో భోగి పండుగ ఏ తేదీన జరుపుకోవాలనే విషయంలో సామాన్యుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13న భోగి వస్తుంటుంది, కానీ ఈ ఏడాది గ్రహ గతులు , సౌరమాన గణాంకాల ప్రకారం తేదీలో మార్పు…