ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు.. ''రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాపాక గ్రామంలో మహిళలు పిడకలతో బోగి మంటలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామ పూర్వికుల ఆచార సంప్రదాయం ప్రకారం.. ఇంటి నుండి కనీసం ఒక పిడకైనా ప్రతి ఏటా బోగి మంటకు సొంతంగా తయారు చేసుకుని వేయాలి. ప్రతి ఏటా బోగి సమయానికి గ్రామంలో ప్రతి ఒక్కరు 116 నుండి 1116 వరకు ప్రతి ఒక్కరు బోగి మంటల్లో పిడకలు వేయడం వారి సాంప్రదాయంగా మలుచుకున్నారు. ఇలా గ్రామంలో అలవాటుగా మారిన ఈ…