దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర(MSP)కి చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
మావోయిస్టులు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.
కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను నిరసిస్తూ పలు సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు నేడు తనిఖీలు…
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతూనే వున్నాయి. భారత్ బంద్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. విశాఖపట్నం పరిధిలోని రైల్వే స్టేషన్ ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. అనుమనితులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. రైళ్ల రాకపోకలు యధాతథంగా జరుగుతున్నాయి. అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో వాల్తేర్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. బైక్, కారు పార్కింగ్ అనుమతి నిరాకరించారు. అటు, పార్సిల్…
* భారత్ బంద్ నేపథ్యంలో ఏపీలో అన్ని రైల్వే స్టేషన్లలో భారీ భద్రత * తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు. భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు. * నేడు ఛలో అనమర్లపూడికి పిలుపునిచ్చిన టీడీపీ. ఛలో అనమర్లపూడికి అనుమతి లేదంటున్న పోలీసులు. అనమర్లపూడిలో144 అమలులో ఉందంటున్న పోలీసులు. * ఆత్మకూరు ఎన్నికల నిర్వహణపై నెల్లూరులో అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సమావేశం.…
దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా ‘అగ్నిపథ్’ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని? ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశ్నిస్తూ.. నిరసనలు చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు కూడా పాకింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా…
దేశంలో ‘అగ్నిపథ్’ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ రిక్రూట్ మెంట్ స్కీమ్ పై ఆర్మీ ఆశావహుల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో ప్రారంభం అయిన ఆగ్రహ జ్వాలలు మెల్లిగా దేశం మొత్తం పాకుతున్నాయి. ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కేవలం నాలుగేళ్ల కాలపరిమితితో ఈ అగ్నిపథ్ స్కీమ్ రావడంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళనకు, ఆగ్రహానికి గురవుతున్నారు. అగ్నిపథ్…
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. వరంగల్ జిల్లా హనుమకొండలో కార్మికుల నిరసనకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మద్దతు తెలిపారు. పలుచోట్ల కార్మికుల ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.సిద్దిపేట పట్టణంలో కేంద్రప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించాయి కార్మిక సంఘాలు. ఆదిలాబాద్ లో బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ముందు ఉద్యోగుల…
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు దిగాయి కార్మిక సంఘాలు. కార్మిక, కర్షకులు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో సమ్మె నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల జాయింట్ ఫోరం ఇంతకుముందే వెల్లడించింది. కార్మక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నాయి. ఈ సమ్మెలో దాదాపు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని ఆల్ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అమర్జీత్ కౌర్ తెలిపారు. గ్రామీణప్రాంతాల్లోనూ…