ఇవాళ, రేపు దేశ వ్యాప్తంగా భారత్ బంద్. సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్న కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. నిలిచిపోనున్న కార్యకలాపాలు. ఇవాళ టర్కీలో రష్యా, ఉక్రెయిన్ ల మధ్య మరోసారి చర్చలు. అనంతపురంలో నేడు ఎస్కేయూ పాలకమండలి సమావేశం. *నేడు నెల్లూరు నగరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన. వీపీఆర్.కన్వెన్షన్ సెంటర్ లో జరిగే మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరు కానున్న సీఎం జగన్. పాల్గొననున్న మంత్రులు, ఎం.ఎల్.ఏ.లు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు. స్టీల్…
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా ప్రైవేట్ పరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు మార్చి 28, 29 తేదీల్లో భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందుగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచించింది. అటు భారత్ బంద్‌కు దేశంలోని పలు రంగాలకు చెందిన కార్మికులు కూడా…
దేశంలో ధరల పెరుగుదల, ఉద్యోగాల్లో కోత, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, కార్మిక చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న సార్వత్రిక సమ్మె ను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు టిఎస్ యుటిఎఫ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం 2020 ని రద్దు చేయాలని, ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని టిఎస్ యుటిఎఫ్…
ప్రస్తుతం ఏ విషయం అయినా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో పాకిపోతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వారం రోజులు లాక్‌డౌన్ విధించిందనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. Read Also: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని కేంద్రప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్‌చెక్…
కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ రోడ్డెక్కాయి విపక్ష పార్టీలు. భారతబంద్ పాటించాయి. ఈ విపక్షపార్టీల బృందానికి దూరంగా ఉండిపోయింది అధికారపార్టీ టీఆర్ఎస్. బంద్‌కు దూరం వ్యూహాత్మకమా? ఇంకేదైనా బంధాలకు బాట పడుతోందా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? భారతబంద్‌కు దూరంగా ఉన్న టీఆర్ఎస్‌పై చర్చ..! పెరిగిన పెట్రోల్, నిత్యావసరాల ధరలతోపాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారత్ బంద్ పాటించాయి కాంగ్రెస్, వామపక్షపార్టీలు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు కొన్ని…
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.. అయితే, భారత్ బంద్ ఫెయిల్ అయ్యిందని.. రైతులంతా ప్రధాని నరేంద్ర మోడీకి అండగా ఉన్నారని తెలిపారు.. బీజేపీ ఎంపీ, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఛాహార్.. విపక్షాలు పిలుపు నిచ్చిన భారత్ బంద్ ఫెయిల్ అయ్యింది.. ఎక్కడా బంద్ ప్రభావం కనిపించలేదన్న ఆయన.. రైతు ముసుగులో కాంగ్రెస్, విపక్షాలు…
ఇవాళ జరిగిన భారత్ బంద్‌పై సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… రైతుల కోసం జరిగిన బంద్‌లో రైతులు ఎవరూ పాల్గొనలేదని విమర్శించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బంద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలవడం ఆశ్చర్యకరమైన విషయం అంటూ మండిపడ్డారు.. ఇక, వైసీపీ, టీడీపీ.. పార్లమెంట్‌లో కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులకు ఎందుకు మద్దతు తెలిపాయి? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు…
దేశంలోని 19 ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. పలు బీజేపీయేతర ప్రతిపక్షాలు బంద్‌ను విజయవంతం చేసేందుకు నడుంబిగించాయి. సంయుక్త కిసాన్ మోర్చ -SKP ఈ బంద్‌కు నాయకత్వం వహిస్తోంది. కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం బంద్ పిలుపినిచ్చారు. దేశంలోని నలబై రైతు సంఘాలు ఏకమై సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి మోడీ సర్కార్‌పై ఉద్యమిస్తున్నాయి. కొత్త చట్టాలను వెనక్కి…
ఈనెల 27 న భారత్ బంద్ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్ కొనసాగనుంది.. ఇందుకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. మోడీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.. అయితే.. 27న రైతు సంఘాలు…