ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి అభివృద్ధి వైపు తీసుకెళతాం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎంవైఎస్ జగన్ తను ఉండి వచ్చిన ప్రాంతానికి వెళుతున్నాడని విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని కూడా స్కాంలలో వదల్లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి పార్కుకి, పార్లమెంటుకి వ్యత్యాసం తెలీదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 71వ జయంతి కార్యక్రమం జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి బీజేపీ…