ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో కనిపిస్తోన్న భానుచందర్ ఒకప్పుడు కరాటే ఫైట్స్ తో కదం తొక్కారు. కొన్ని చిత్రాలలో హీరోగానూ అలరించారు. భానుచందర్ పూర్తి పేరు మద్దూరి వేంకటత్స సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద. ఆయన తండ్రి తెలుగులో విశేషమైన పేరు సంపాదించిన సంగీత దర్శకులు మాస్టర్ వేణు. తండ్రిలాగే ఆరంభంలో భానుచందర్ సైతం సరిగమలతో సావాసం చేశారు. పదనిసలో పయనం సాగించాలనీ ప్రయత్నించారు. గిటారిస్ట్ గా పేరు సంపాదించారు. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు నౌషాద్ వద్ద…