తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం ఏదో ఒక అలక సర్వ సాధారణమైంది. సభలు.. సమావేశాలు ఏది జరిగినా అలకలు.. అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీ పరిస్థతి కాస్త మెరుగైందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్న తరుణంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రియాంకగాంధీ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఓదెలుతోపాటు జడ్పీ ఛైర్‌పర్సన్ అయిన ఓదేలు భార్య భాగ్యలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అధికారపార్టీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఈ తరహా చేరికలు పార్టీకి పాజిటివ్ సంకేతాలు…