గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ బాషలలో రూపొందిన ఈ సినిమా టీజర్ ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి లిరికల్ సాంగ్ ‘చరిత చూపని’ మిలియన్ వ్యూస్ సాధించటం పట్ల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు దర్శకనిర్మాతలు. త్వరలో మిగిలిన పాటలను విడుదల చేసి సినిమాను కూడా…
రమేష్ ఉడత్తు, గౌరి వాలాజా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘భగత్ సింగ్ నగర్’. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. వాలాజా క్రాంతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విదార్థ్, ధృవీక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య ప్రధాన పాత్రధారులు. ‘భగత్ సింగ్ నగర్’ అనేది ఓ అందమైన ప్రేమకథా చిత్రమని,…