అక్కడ అధికారపార్టీ నేతలకు ఇసుకే బంగారం. ఇసుకపై వచ్చే ఆదాయమే వారికి కీలకం. అటువైపు ఎవరైనా తొంగి చూసినా.. మోకాలడ్డినా సెగలు.. భగభగలు తప్పవు. ఎత్తుకు పైఎత్తులు వేయడంలో వెనకాడరు రాజకీయ నేతలు. ప్రస్తుతం అలాంటి ఓ పంచాయితీ అధికారపార్టీతోపాటు.. అధికారవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భద్రాచలం ఇసుక ర్యాంప్‌పై దుమారం..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక రాజకీయ నాయకులకు, కొందరు అధికారులకు ప్రధాన ఆదాయ వనరు. ఇసుకపై వచ్చే రాబడి పోకుండా.. తమకు అనుకూలురైన అధికారులకు…