హైదరాబాద్ సిటీ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. ఈ యూట్యూబర్లు వ్యూస్ ద్వారా వస్తున్న ఆదాయం కంటే మించి ఆదాయం వస్తుండడంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి ప్రముఖ యూట్యూబర్ల…