Betting Apps : ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ సూచన మేరకు సూర్యాపేట జిల్లా పోలీసులు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కారణంగా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. అయితే, సన్నీ యాదవ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు. నోటీసులు ఇచ్చిన రెండు వారాలు గడుస్తున్నప్పటికీ, అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, పోలీసులు కీలక…
తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు. యాంకర్ శ్యామల పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదయింది. ‘Andhra365’ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు శ్యామల ప్రమోషన్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)…
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మియాపూర్ పీఎస్ పరిధలో 25మందిపై నమోదు నమోదు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు.
బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడని కేసు నమోదైన క్రమంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా,…
తమ స్వార్ధ ప్రయోజనాల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై…
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది.. బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు వణికి పోతున్నారు.. సినీ రాజకీయ టీవీ రంగాన్ని చెందిన నటీనటులు బెట్టింగ్ యాప్‌ల కొరకు ప్రచారం చేశారు.. దీనికి తోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పించారు.. దీనికి తోడు మంచు కుటుంబంలో సెన్సేషనల్ అయిన మంచు లక్ష్మి కూడా బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేశారు..