ధనుష్ హీరోగా నటించిన, విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం ‘కర్ణన్’. ఈ ఏడాది ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రంపై ప్రశంసలు ఇంకా ఆగట్లేదు. అలాగే అవార్డులు కూడా రావడం ఆగడం లేదు. ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న “కర్ణన్” చిత్రం తాజాగా బెంగుళూరులో జరిగిన ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ భారతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది. ఇది నాలుగో ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎడిషన్. ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్…