‘ద బ్యాట్ మేన్’ సినిమా మార్చి 4న జనం ముందు వాలగానే, ‘బ్యాట్ మేన్’ లవర్స్ మదిలో గబ్బిలం మనిషి పాత చిత్రాల తలంపులు మెదిలాయి. గతంలో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ ట్రయాలజీ’ని తలచుకున్నారు ‘బ్యాట్ మేన్’ ఫ్యాన్స్. నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ బిగిన్స్’ (2005), ‘ద డార్క్ నైట్’ (2008), ‘ద డార్క్ నైట్ రైజెస్’ (2012) చిత్రాలు ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి. ఈ…