బెంగళూరులో ఓ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించే సాహసం చేశాడు. ప్రమాదమని తెలిసినా కూడా ఏ మాత్రం భయపడకుండా డేరింగ్ అరెస్ట్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెంగళూరులో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. మహిళను బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. వాకింగ్‌కు వెళ్లేందుకు స్నేహితురాలి కోసం నిరీక్షిస్తున్న సమయంలో హఠాత్తుగా ఒక వ్యక్తి అమెను పట్టుకుని లైంగికంగా వేధించాడు.