Marital Dispute: 40 ఏళ్ల టెక్ ప్రొఫెషనల్ ఆదివారం బెంగళూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ప్రశాంత్ నాయర్‌గా గుర్తించారు. వైవాహిక వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. మృతుడు లెనోవా లో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
Bengaluru Shocker: బెంగళూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ, ఓ టెక్కీ తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఆర్‌ఎంవీ 2వ స్టేజ్ ప్రాంతంలోని అద్దెకు ఉంటున్న సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్, తన కుటుంబంతో సహా శవాలుగా కనిపించారు. హత్యా-ఆత్మహత్య అనే అనుమానంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Atul Subhash Case: భార్య తప్పుడు కేసులతో వేధింపులకు గురైన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ కేసులో ఇప్పటికే సుభాష్ భార్య నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కాన్వాయ్‌ను అతుల్ సుభాష్ సన్నిహితులు కారులో వెంబడించారు. ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారించినా.. పట్టించుకోకుండా వెంటాడారు.
Bengaluru Techie Suicide: బెంగుళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. భార్య, ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో భార్య నికితా సింఘానియా కుటుంబంపై సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Bengaluru: భార్య, ఆమె కుటుంబం వేధింపులతో 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనకు న్యాయం జరగాలని సోషల్ మీడియా వేదిక నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. బెంగుళూర్‌లో సోమవారం ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు నేరం మోపిందని, న్యాయవ్యవస్థ కూడా ఆమెకు సపోర్టు చేస్తుందని చెబుతూ ఆయన రాసిని సూసైడ్ లేఖ, రికార్డ్ వీడియో వైరల్ అవుతున్నాయి.