క్యారెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ క్యారెట్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వారానికి కనీసం రెండుసార్లు క్యారెట్లు తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లను సలాడ్లు, జ్యూస్‌లు వంటి అనేక రూపాల్లో ఆహారంలో చేర్చుకోవచ్చు. క్యారెట్లలో విటమిన్ ఏ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో, జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో, అలాగే శరీర రోగనిరోధక…