డబుల్ బెడ్రూం లబ్దిదారులకు శుభవార్త చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా మొగ్దుంపూర్ లో డబుల్ బెడ్ రూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… డబుల్ బెడ్రూం ఇండ్లు దశల వారీగా ఇస్తామని.. ఎవరికీ అన్యాయం జరుగనివ్వబోమని ప్రకటించారు. ఇది కంటీన్యూయస్ ప్రాసెస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు కూడా మనము ఇక్కడే బతికి ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయిగా…