Layoffs: టెక్ సంస్థల్లో ఉద్యోగాల లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్లుగా ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అని టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లో పాటు చిన్నాచితకా కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక అస్థిరత కారణంగా ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనలతో సంస్థలు ఉద్యోగులను తీసేస్తున్నాయి.