కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. గతంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. యడ్యూరప్ప ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై ఇప్పుడు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన్ను తొలగించి కొత్త ముఖ్యమంత్రిని ఏర్పాటు చేయాలని అదిష్టానంకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, కర్ణాటకలోని బెల్గావిలో ఓ వినూత్న ప్రదర్శన జరిగింది. బెల్గావి ఎమ్మెల్యే రమేష్ జార్కొలికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆయన అనుచరులు ఒంటెలతో నిరసనను తెలియజేశారు.…