భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొన్ని సంవత్సరాల క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టుతో మ్యాచ్‌లు లేని సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న భారత ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది. భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ను పక్కన పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే బీసీసీఐ ఆ విధానంను తీసుకొచ్చింది. ఈ మార్పు దేశవాళీ క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది.…