Cyclone Ditwah: నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా తుఫాన్ ‘ కొనసాగుతోంది.. తుపాను ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 510 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. తుపాన్ గడిచిన 6 గంటల్లో 3కి.మీ వేగంతో కదిలిందని వెల్లడించారు. ఎల్లుండి తెల్లవారుజామునకు తీవ్ర వాయు గుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే…