తెలంగాణ పూల సంబురం విశ్వవ్యాప్తమైంది. మన సాంస్కృతిక వైభవం ఖండాంతరాలు దాటింది. పూల పండుగను చూసి ప్రపంచమే అబ్బురపడింది. దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ దృశ్యం ఆవిష్కృతమైంది. ఎడారి దేశంలో విరబూసిన తంగేడువనాన్ని చూసి మరోసారి ప్రపంచం దృష్టి తెలంగాణపై పడింది.ఎడారి దేశంలో తంగేడు వనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను విశ్వవేదికపై సగర్వంగా ప్రదర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ రోజు సాయంత్రం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి…