ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగిన తరువాత స్నానం చేసుకొని తమ పనులు ప్రారంభిస్తారు. అయితే స్నానం చేసే విషయంలో కొందరు చన్నీళ్లతో చేస్తే.. మరికొందరు వేడి నీటితో చేస్తారు.
చలికాలంలో ఎవరికైనా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలని ఉంటుంది. చన్నీళ్లతో స్నానం చేయాలంటే చలికి తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అయితే, కొంతమంది ఎంత చలిగా ఉన్నా చన్నీళ్లతోనే స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఎంత చలిగా ఉన్నా చన్నీళ్లవైపే మొగ్గు చూపుతారు. ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అయింది. ఓ చిన్న పిల్లవాడు పొయ్యి వెలిగించి దానిపై పెద్ద మూకుడు పెట్టి అందులో నీళ్లు పోసి దాంట్లోనే కూర్చొని వేడి వేడిగా స్నానం…