బియ్యం ఎగుమతులపై విధించిన చాలా పరిమితులను భారత్ తొలగించింది. 2023లో ఈ ఆంక్షలు విధించారు. రుతుపవనాలు బాగా ఉండడం, ప్రభుత్వ గోదాముల్లో సరిపడా బియ్యం నిల్వ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Traders Protest on Basmati: దేశంలోని పలు రాష్ట్రాల్లో బియ్యం వ్యాపారులు నిరసనకు దిగారు. ఇది హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరసన కారణంగా దాదాపు 300 హోల్‌సేల్ మార్కెట్లలో బాస్మతి కొనుగోలు నిలిచిపోయింది.