బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా ర్యాలీ చేశారని అభియోగం మోపారు. అయితే నిన్న (గురువారం) ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. బయటికొచ్చిన తర్వాత ర్యాలీతో తెలంగాణ భవన్ కు వచ్చారు. అయితే అనధికారికంగా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ లో బంజారాహిల్స్ స్పాలు, మసాజ్ సెంటర్లు, బ్యూటీ స్పాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో స్పాస్‌లోన్‌పై దాడి చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో హిజ్రాల గ్రూపు వీరంగం సృష్టించింది. ఏరియాలుగా పంచుకుని వసూళ్లపై హిజ్రాల గ్రూపుల మధ్య వాదోపవాదాలు చెలరేగడంతో.. అదికాస్త చిలి చిలికి గాలివానైంది.