ప్రముఖ హాస్యనటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేశ్ గత యేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో ఆర్టిస్ట్ గా రీ-ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ నుండి అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. గురువారం విడుదలైన ‘క్రేజీ అంకుల్స్’ మూవీలో నిర్మాత పాత్రనే బండ్ల గణేశ్ పోషించాడు. తన తోటి హాస్యనటులు గతంలోనే హీరోలుగా మారినా, అలాంటి ప్రయత్నం చేయని బండ్ల గణేశ్ ఇప్పుడు హీరోగా నటించబోతున్నాడు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’…