ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన విశ్వక్సేన్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకునే పనిలో ఉన్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించే పనిలో బిజీబిజీగా ఉన్నాడు. గత ఏడాది ఆయన నటించిన గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది.…