అందరికీ ఆమోదయోగ్యుడైన బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ‘అలయ్ బలయ్’ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఇది 17వ ఆలయ్ బలయ్ కార్యక్రమన్నారు. ఈ నెల 6న ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్నామని, ఈ ఏడూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సారి ఐదు రాష్ట్రాల గవర్నర్‌లను, ముఖ్యమంత్రులను ఆహ్వానించామన్నారు. తెలంగాణ జేఏసీ కంటే ముందు ఆలయ్…