తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని భావించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మొదట్లో బుజ్జగించారు. ఆ తర్వాత అగ్రనాయకత్వంతో మాట్లాడించాలని నిర్ణయించింది పార్టీ. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే... అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు.