పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు కోలిన్ మున్రో బాల్ బాయ్ ను ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.