TJR సుధాకర్‌బాబు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి YCP MLAగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో.. మొదట్లో ఎమ్మెల్యేకు లోకల్ పార్టీ కేడర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు కనిపించినా.. తర్వాత గ్యాప్ వచ్చేసింది. నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు, చీమకుర్తి మండలాల్లో ఈ గ్యాప్ మరీ ఎక్కువగా ఉందట. ఈ అంశాన్ని గుర్తించినా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదట సుధాకర్‌బాబు. దాంతో విభేదాలు కోల్డ్‌వార్‌గా మారిపోయినట్టు టాక్. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు…