ఏపీలో గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలకు బాలయోగి పేరును తొలగించడం తీవ్ర అభ్యంతరకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును వైసీపీ ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. అంబేద్కర్ పేరునే పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. జగన్, వైఎస్ఆర్ పేరుతో కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టవచ్చని సూచించారు. Read Also: ఆందోళనలు కొనసాగిస్తాం.. స్పష్టం…