Andhra Pradesh: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమాన సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ-షార్జా మధ్య రాకపోకలు కూడా ప్రారంభం కావడంతో షార్జా నుంచి విమానం గన్నవరం చేరుకుంది. షార్జా వెళ్లే విమాన సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి… టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు…
మచిలీపట్నంలో అధికార పార్టీ వైసీపీలో వర్గవిభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య విభేదాలు రోడ్డుకెక్కాయి. ఎంపీ బాలశౌరి మచిలీపట్నం పర్యటనను పేర్ని నాని వర్గం అడ్డుకుంది. దీంతో ఎంపీ బాలశౌరి వర్గం భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పేర్ని నాని వైఖరిపై ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. మచిలీపట్నం పేర్ని నాని జాగీరా అని ప్రశ్నించారు. మూడేళ్ళ నుంచి సొంత పార్టీ ఎంపీ అయిన తననే మచిలీపట్నం రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ బాలశౌరి…