అకాల మరణంతో కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపిన శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహనికి అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. ఆయనకు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలకడానికి భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. నిన్న కర్ణాటక సీఎం బొమ్మై ఆసుపత్రిలోనే పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక ఈరోజు సినీ ఇండస్ట్రీ…