పిల్లలు పాఠశాలకు వచ్చేందుకు, పాఠశాలపై ఆసక్తి చూపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను పెయింటింగ్స్ తో నింపనుంది. ఈ నేపథ్యంలో పిల్లలకు ఇష్టపడే కార్టూన్‌లు, జంతువులు, నైతిక విలువలు తెలిపే చారిత్రక నిర్మాణాలతో అందమైన పెయింటింగ్‌లు, చిత్రాలతో, ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో గోడలు, భవనాలు, తలుపులు, కిటికీలు త్వరలో విద్యార్థులకు అభ్యాస సామగ్రిగా మారనున్నాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం…