నటసింహం నందమూరి బాలకృష్ణ నటజీవితాన్ని పరిశీలిస్తే అబ్బురం అనిపిస్తుంది. ఇప్పుడున్న నటుల్లో బాలకృష్ణనే సీనియర్. ఎన్నెన్నో అపూర్వ విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులు బాలయ్య కెరీర్ లో చోటు సంపాదించాయి. బాలయ్య పని అయిపోయింది అన్న ప్రతీసారి ఆయన అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకు ఆయన నటించిన ‘అఖండ’ తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. వసూళ్ళ పరంగానే కాదు, రన్నింగ్ లోనూ బాలకృష్ణ సినిమాల తీరే వేరుగా సాగుతూ ఉంటుంది. ఆయన అభిమానుల తీరు కూడా వేరుగానే కనిపిస్తుంది.…