Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) తన స్థావరాన్ని మార్చే పనిలో ఉంది. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అనుబంధంగా పనిచేసే టీఆర్ఎఫ్ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే, టీఆర్ఎఫ్‌ని విదేశీ ఉగ్రవాద సంస్థ(FTO)గా అమెరికా గుర్తించినందున తన హెడ్‌క్వార్టర్‌ను మార్చే పనిలో ఉంది.