శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీ సీతా సమేత జగదభిరాముడి శోభయాత్రను భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శ్రీ రామ నవమి శోభాయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనాతో రెండు సంవత్సరాలుగా శోభయాత్ర నిర్వహించలేదు. అయితే రెండేళ్ల తరువాత హైదరాబాద్‌లో రామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగనుంది. సీతారాంబాగ్ నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగునుంది. గంగాబౌలి ఆకాశ్ పురి హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో…