బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీ విపక్షాలకు ఓ ఆఫర్ ఇచ్చింది. సంప్రదాయాలను గౌరవిస్తూ బద్వేలులో పోటీకి దిగకుంటే మంచిదన్నది ఆ ఆఫర్ సారాంశం. ముందే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ.. ఆ ఆఫర్‌ను స్వీకరించి పోటీ, ప్రచారం జంఝాటాలు లేకుండా గౌరవంగా తప్పుకొంటుందా? లేక తిరుపతిలాగే సై కొడుతుందా? 2019లో బద్వేలులో వైసీపీకి 44 వేల ఓట్ల మెజారిటీ..! అనారోగ్యంతో ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో కడప జిల్లా బద్వేలులో ఉపఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ 30న ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించడానికి…