కడప జిల్లా బద్వేల్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. యువకుడి చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. శనివారం ఘటన జరిగితే ఎవరు పట్టించుకోలేదని.. కేవలం తాను వస్తున్నాను అని బాధితులకు సహాయం అందించారని ఆయన అన్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదని తీవ్రంగా మండిపడ్డారు.