ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బధాయ్ హో’ సినిమా ఉత్తరాదిన విజయకేతనం ఎగరేసింది. ఆ సినిమా దక్షిణాది రీమేక్ హక్కుల్ని కొంతకాలం క్రితం బోనీకపూర్ సొంతం చేసుకున్నారు. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా రీమేక్ పనులు వేగంగా సాగలేదు. అయితే తాజాగా తమిళ రీమేక్ వరకూ బోనీ కపూర్ కొంత పురోగతిని సాధించారు. ఇటీవల ‘అమ్మోరు తల్లి’ మూవీలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఆర్. జె. బాలాజీ చేతికి ‘బధాయ్ హో’ రీమేక్ బాధ్యతలను…