బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్‌లో ప్రస్తావించినట్టుగానే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాడ్‌బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.30,600 కోట్ల గ్యారెంటీ ఇస్తోందని ప్రకటించారామె.. బ్యాంకింగ్‌రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నామన్న నిర్మలా సీతారామన్.. ఇప్పుడిప్పుడే బ్యాంకింగ్ రంగం కోలుకుంటుందన్నారు.. ఇక, ఎన్‌పీఏలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు నిర్మలా సీతారామన్.. 2018 నుంచి ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశామని…