జీవితం విసిరే సవాళ్లను డబ్బు, పేరు, పలుకుబడి… ఇవేవీ అడ్డుకోలేవు. మందిరా బేడి పరిస్థితే ఇందుకు తాజా ఉదాహరణ. ఆమె భర్త జూన్ నెలలో గుండెపోటుతో అకాల మరణంపాలయ్యాడు. ఆయన వయస్సు 49 ఏళ్లే. ఇద్దరు పిల్లలతో మందిరా అమాంతం ఒంటరిగా మారింది. అయినా ఆత్మవిశ్వాసంతో నిలిచిన ఆమె ఇప్పుడు ‘బ్యాక్ టూ వర్క్’ అంటూ ఒక ఫోటో షేర్ చేసింది. గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ ముందు పింక్ శారీలో కనిపించిన ఆమె “సెండింగ్ సమ్ లవ్…