జీవితం విసిరే సవాళ్లను డబ్బు, పేరు, పలుకుబడి… ఇవేవీ అడ్డుకోలేవు. మందిరా బేడి పరిస్థితే ఇందుకు తాజా ఉదాహరణ. ఆమె భర్త జూన్ నెలలో గుండెపోటుతో అకాల మరణంపాలయ్యాడు. ఆయన వయస్సు 49 ఏళ్లే. ఇద్దరు పిల్లలతో మందిరా అమాంతం ఒంటరిగా మారింది. అయినా ఆత్మవిశ్వాసంతో నిలిచిన ఆమె ఇప్పుడు ‘బ్యాక్ టూ వర్క్’ అంటూ ఒక ఫోటో షేర్ చేసింది. గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ ముందు పింక్ శారీలో కనిపించిన ఆమె “సెండింగ్ సమ్ లవ్ అండ్ పాజిటివిటి టూ ఎనీవన్ హూ నీడ్స్ ఇట్” క్యాప్షన్ ఇచ్చింది. అంతే కాదు, మందిర నవ్వుతూ కెమెరాకు ఫోజిచ్చి తన ఫాలోయర్స్ కు హాయ్ చెప్పింది!
ఓ వారం క్రితమే మందిరా బేడీ ‘బిగిన్ అగైన్’ అంటూ హ్యాష్ ట్యాగ్ వాడింది. ఆ పోస్టులో ‘మళ్లీ మొదలు పెట్టబోతున్నాను’ అంటూ ఆమె అభిమానులకి భరోసా ఇచ్చింది.
మందిరా తన భర్త రాజ్ కౌశల్ చనిపోయాక అతడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. “25 ఏళ్లుగా ఒకరికి ఒకరం తెలుసు… 23 ఏళ్లుగా వివాహ బంధంలో కొనసాగాం… ఎన్నో సంఘర్షణల మధ్య, ఎన్నో ఎత్తుపల్లాల మధ్య…” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రాజ్ కౌశల్, మందిరా బేడి వివాహం 1999లో జరిగింది…
