సాధారణంగా బిడ్డ పుట్టగానే అందరూ ఎంత బరువు ఉన్నారో అని ఆరా తీస్తుంటారు. ఆరోగ్యవంతుడైన బిడ్డ కనీసం 2.5 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య బరువు ఉండాలి. కానీ, కొన్ని కారణాల వల్ల బిడ్డలు తక్కువ బరువుతో పుడుతుంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు కంగారు పడటం సహజం. అయితే, ఆధునిక వైద్యం ఇంట్లో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అసలు బిడ్డ ఎందుకు బరువు తక్కువగా పుడతారు?…