బాలీవుడ్ నటి నేహా ధూపియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నేహా భర్త, నటుడు అంగద్ బేడీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 41 ఏళ్ల ఈ ముదురు బ్యూటీ 2018 లో తనకంటే చిన్నవాడైన నటుడు అంగద్ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 లో ఈ దంపతులకి ఒక పాప పుట్టగా,…
శేఖర్ కమ్ముల లీడర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఎన్.ఆర్.ఐ.భామ రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత మిరపకాయ్, మిర్చి, నాగవల్లి వంటి తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించి కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. నాగార్జున భాయ్ చిత్రంలో చివరగా నటించిన రిచా ఆ తర్వాత అమెరికా తిరిగి వెళ్ళిపోయి, బిజినెస్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ చేసింది. ఇక 2019లో తన స్నేహితుడు జోయ్ లంగెల్లాను రిచా వివాహం చేసుకుంది. అయితే…
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ గత నెల మే 22న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్‌కు తాజాగా శ్రేయా సర్‌ప్రైజ్ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా తన తనయుడికి ‘దేవ్యాన్ ముఖోపాధ్యాయ’గా నామకరణం చేసినట్లు ఆమె వెల్లడించారు. తల్లిగా, తండ్రిగా తమ హృదయాలు…
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో, సన్నిహితులతో పంచుకున్నారు. ‘ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇంతటి అనుభూతిని గతంలో ఎప్పుడు నేను పొందలేదు. ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా కుటుంబం సంతోషంగా వుంది’ అలాగే అభిమానుల దీవెనలకు ధన్యవాదాలు అంటూ ఆమె రాసుకొచ్చారు. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయ తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను…