Rajasthan: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ దాటి 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం మరో ‘యోగి’ ఎదుగుదలకు దారి తీసే అవకాశం ఏర్పడింది. రాజస్థాన్ యోగిగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మి నాయకుడు, అల్వార్ ఎంపీ బాబా బాలక్ నాథ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నారు.